ఢిల్లీ రేస్ కోర్స్ మసీదు కూల్చివేత వివాదంపై కిరెన్ రిజిజుకు అసదుద్దీన్ ఒవైసీ లేఖ

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

ఢిల్లీలోని రేస్ కోర్స్ ప్రాంతంలో మసీదు కూల్చివేత నోటీసుల అంశంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర మంత్రి కిరెన్ రిజిజును తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో ఉన్న చారిత్రక మసీదును రక్షించేందుకు వక్ఫ్ బోర్డు విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ వివాదంపై అత్యవసరంగా స్పందించి మసీదును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామంపై పలు వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.