తమిళనాడులో కలకలం: సైన్ బోర్డుపై హిందీ అక్షరాల వివాదంపై ఇద్దరు అధికారుల సస్పెన్షన్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తూత్తుకుడి
ద్విభాషా విధానాన్ని ఉల్లంఘించి రహదారి సైన్ బోర్డుపై హిందీ అక్షరాలు ముద్రించిన వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తమిళనాడు ప్రభుత్వం ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు. తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో దశాబ్దాలుగా అమలవుతున్న కఠిన ద్విభాషా విధాన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది.