గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలంటూ జన్నారం ఐసీడీఎస్ సూపర్వైజర్ పిలుపు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
గర్భిణులు తగిన పౌష్టికాహారం తీసుకోవాలని జన్నారం ఐసీడీఎస్ సూపర్వైజర్ కవితా సూచించారు. మండలంలోని దేవుని గూడ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలింతలు పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని ఆమె తెలిపారు. ముర్రుపాల ప్రాధాన్యంపై గ్రామ మహిళలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.