రైల్వే శాఖ కీలక నిర్ణయం: విజయవాడ, విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయవాడ
విజయవాడ, విశాఖపట్నం మధ్య ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక జనసాధారణ్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 17న విశాఖ నుంచి విజయవాడకు, 19న విజయవాడ నుంచి విశాఖకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని వారు స్పష్టం చేశారు. మార్గమధ్యలోని పలు ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లకు అధికారికంగా స్టాపింగ్‌లు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసుల సమయాలను ముందే సరిచూసుకోవాలని సూచించారు.