ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్: రామ్ లీలా మైదానంలో భారీ సభ

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

నవంబర్ మొదటి తేదీన న్యూఢిల్లీలోని చారిత్రక రామ్ లీలా మైదానంలో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక మహాసభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో గళం వినిపించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఈ సభ నిర్వహణ వెనుక ఉన్న ప్రధాన ఎజెండాపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.