అమెరికాలో వైభవంగా బతుకమ్మ, దసరా వేడుకలు: అంబరాన్నంటిన సంస్కృతి సంబరాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Portland
అమెరికాలోని ఒరెగాన్ పోర్ట్లాండ్ నగరంలో ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఓటీఏ అధ్యక్షుడు శ్రీని అనుమాండ్ల తెలిపారు. స్థానిక ఆర్ఏ బ్రౌన్ మిడిల్ పాఠశాలలో జరిగిన ఈ వేడుకల్లో తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సాంప్రదాయ దుస్తులతో సందడి చేశారు. పూల బతుకమ్మల ఆటపాటలు, కోలాటాలు, జమ్మి పూజలతో పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్నంటాయని నిర్వాహకులు వెల్లడించారు.