ఢిల్లీలో ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం రద్దుతో ప్రయాణికుల ఆందోళన
రిపోర్టర్: రాము
స్థలం: ఢిల్లీ
రాజధాని ఢిల్లీ నుంచి అబుదాబి వెళ్లాల్సిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు కావడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సకాలంలో సమాచారం అందక సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఎయిర్‌లైన్స్ అధికారులు స్పందించి ప్రభావితమైన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమాన సౌకర్యంతో పాటు వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.