కొడుకును వదిలి వెళ్తుంటే విమానంలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ముంబై

తల్లిగా మారిన అనుభవాలను బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పంచుకున్నారు. తన కుమారుడు నీర్ను వదిలి తొలిసారి పని కోసం ప్రయాణించినప్పుడు తీవ్రమైన అపరాధ భావనకు గురయ్యానని ఆమె తెలిపారు. విమానంలో దాదాపు మూడు గంటల పాటు ఏడుస్తూనే ఉన్నానని భావోద్వేగంగా చెప్పారు. సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు తల్లులపై మరింత మానసిక ఒత్తిడిని పెంచుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన రీఎంట్రీ ప్రాజెక్ట్ షూటింగ్స్లో బిజీగా ఉన్నారు.