రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
రిపోర్టర్: సతీష్
స్థలం: Amaravati
రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న ఈ కౌంటింగ్ ప్రక్రియ ద్వారా బరిలో నిలిచిన ఇరవై ఒక్క వేల మందికి పైగా అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం మూడు వందల అరవై ఐదు కేంద్రాలలో ముప్ పై తొమ్మిది వేలకు పైగా సిబ్బందితో పాటు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.