కావలి మున్సిపల్ ఎన్నికల వేడి: బ్యాలెట్ బాక్సులు చేరికతో ఊపందుకున్న ఏర్పాట్లు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కావలి
కావలి పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా బ్యాలెట్ బాక్సులు కార్యాలయానికి చేరాయి. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, సరిహద్దుల విభజన ప్రక్రియ పూర్తికాగా, రిజర్వేషన్ల కసరత్తు తుది దశకు చేరుకుంది. ఛైర్మన్ పదవి జనరల్ కేటగిరికి కేటాయించడంతో ఆశావాహులు రాజకీయ మంతనాలు ముమ్మరం చేశారు.