అమ్మ ఒడికే పరిమితమైన దివ్యాంగ బాలిక: పింఛన్ కోసం తల్లిదండ్రుల కన్నీటి వేడుకోలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా కలువాయి గ్రామానికి చెందిన గంట వాసుదేవకుమార్, కృష్ణవేణి దంపతుల రెండవ కుమార్తె కీర్తన పుట్టుకతోనే తీవ్ర అనారోగ్య సమస్యలతో జన్మించింది. పదమూడేళ్ల వయసు వచ్చినా శారీరక ఎదుగుదల లేక, మాటలు రాక ఆ పాప మంచానికే పరిమితమైంది. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం కావడంతో దివ్యాంగ కోటాలో పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ గత పదేళ్లుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.