దిల్లీలో మైనర్ బాలికపై పోలీసులమంటూ వచ్చి సామూహిక అత్యాచారం
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
దిల్లీలోని కల్కాజీ మందిర్ సమీపంలోని పార్కులో పోలీసులమంటూ నమ్మించి 17 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, పోలీసులతో ఎదురుకాల్పుల్లో ఆసిఫ్ అనే నిందితుడి కాలూకి గాయాలయ్యాయి.