పశ్చిమగోదావరిలో విషాదం: అప్పుల బాధతో గోదావరిలోకి దూకిన కుటుంబం
రిపోర్టర్: నరేష్
స్థలం: పశ్చిమగోదావరి
పశ్చిమగోదావరి జిల్లా చించినాడ బ్రిడ్జి వద్ద అప్పుల బాధతో ఒకే కుటుంబం గోదావరిలోకి దూకింది. తణుకుకు చెందిన శ్రీనివాస్, భార్య పద్మిని, ఇద్దరు పిల్లలు నదిలోకి దూకగా, పద్మినిని జాలర్లు రక్షించారు. శ్రీనివాస్, పిల్లలు గల్లంతయ్యారు. పది రోజుల వ్యవధిలో అదే ప్రాంతంలో జరిగిన రెండో ఘటన కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.