దేశ రాజధానిలో ప్రతిపక్షాల చలో ఢిల్లీ: ఎన్నికల సంఘం తీరుపై రాహుల్ గాంధీ నిప్పులు
రిపోర్టర్: మహేష్
స్థలం: Delhi
కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో మహా ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్ తో మింటో రోడ్ నుంచి రాంలీలా మైదాన్ వరకు ఈ మార్చ్ సాగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ బీజేపీ నేతలు కూడా అదే రోజు విపక్ష వ్యతిరేక నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో దేశ రాజధానిలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.