తప్పుడు అఫిడవిట్‌పై హైకోర్టు ఆగ్రహం, పిటిషనర్‌కు మొట్టికాయలు

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

ఏపీ సమాచార హక్కు చట్టం కమిషన్‌లో న్యాయవాదుల అనుమతిపై దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. వ్యక్తిగత ప్రయోజనం లేదంటూ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ వీరబాబును నిలదీసింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తారా అని హెచ్చరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది క్షమాపణ కోరడంతో, పిల్‌ను ఉపసంహరించుకునేందుకు కోర్టు అనుమతించింది.