వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంపునకు చత్తీస్గఢ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: రాము స్థలం: చత్తీస్‌గఢ్

చత్తీస్గఢ్ ప్రభుత్వ వైద్య మరియు దంత వైద్య కళాశాలల్లో అభ్యసిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల నెలవారీ స్టైపెండ్ను భారీగా పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. వైద్య విద్య డైరెక్టరేట్ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పీజీ వైద్య విద్యార్థులకు సుమారు ఇరవై ఆరు శాతం, డెంటల్ విద్యార్థులకు సుమారు యాభై తొమ్మిది శాతం మేర స్టైపెండ్ పెరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు.