స్టైలిష్ యాక్షన్ తో జైలర్-2 ట్రైలర్ విడుదల: ఆకట్టుకుంటున్న రజినీకాంత్ మార్క్ డైలాగులు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం జైలర్-2 ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, రజినీకాంత్ పవర్ఫుల్ డైలాగులతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఈ భారీ చిత్రంలో మోహన్లాల్, శివరాజ్కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్లో విశేష ఆదరణ పొందుతుండగా, ఈ చిత్రం ఈ నెల 15న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.