'స్పీకర్ స్థానాన్ని అవమానిస్తే ఊరుకోం': ప్రజాస్వామ్య వ్యవస్థపై దుబ్బాక ఎమ్మెల్యే ఆగ్రహం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

శాసనసభ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా స్పీకర్ స్థానాన్ని అవమానించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడంతో సమానమని అధికార పార్టీ తీవ్రస్థగై ధ్వజమెత్తింది. స్పీకర్ స్థానం అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, 119 మంది శాసనసభ్యుల ప్రాతినిధ్యానికి ప్రతీక అని స్పష్టం చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హెచ్చరించింది.