మరణానికి ముందు కనిపించే విచిత్ర దృగ్విషయాలపై వైద్యురాలి సంచలన వెల్లడి
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
ఐసీయూలో చికిత్స పొందుతున్న 84 ఏళ్ల వృద్ధుడు మరణానికి కొద్దిసేపటి ముందు తన చనిపోయిన తల్లి, సోదరి తనను తీసుకెళ్లడానికి వచ్చారంటూ మాట్లాడటం కలకలం రేపింది. ఈ ఘటనను డాక్టర్ సోనాలి మంటూ సోషల్ మీడియాలో పంచుకుంటూ, మరణానికి ముందరి ఈ తరహా విజిన్స్ లేదా డ్రీమ్స్ చాలా మందిలో వైద్యపరంగా గమనించినట్లు తెలిపారు. ఈ అంశంపై వైద్య నిపుణులు మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.