పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యాయత్నం: వృద్ధుడిని కాపాడిన లేబర్ కార్మికులు

రిపోర్టర్: SK స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన వయోవృద్ధుడిని లేబర్ కార్మికులు సమయస్ఫూర్తితో రక్షించారు. జిల్లా సంక్షేమ శాఖ FRO స్వర్ణలత, కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలతో స్పందించి ఓల్డ్ ఏజ్ హోమ్ సిబ్బంది ద్వారా వృద్ధుడికి ఆహారం అందించారు. అనంతరం అతడిని సుల్తానాబాద్ వృద్ధాశ్రమానికి సురక్షితంగా తరలించారు. ఈ సందర్భంగా సహాయం కోసం హెల్ప్లైన్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.