నిర్మల్ జిల్లా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడిగా సంతోష్ నాయక్ నియామకం
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
బిజెపి ఎస్టీ మోర్చా నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులుగా జన్నారం మండలానికి చెందిన సంతోష్ నాయక్ నియమితులయ్యారు. శనివారం బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకత్వం ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. మండలంలోని హాస్టల్ తండాకు చెందిన సంతోష్ నాయక్ పార్టీలో సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ పదవిని కట్టబెట్టారు. ఈ సందర్భంగా సంతోష్ నాయక్ ను పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా అభినందించారు.