కరీంనగర్ లో ఇసుక లారీల బీభత్సం: అంబులెన్స్ కు కూడా దారి ఇవ్వని వైనం

రిపోర్టర్: కృష్ణ స్థలం: కరీంనగర్

కరీంనగర్ జిల్లా ఊటూరులో ఇసుక లారీలు నడిరోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న మహిళను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్నప్పటికీ దారి ఇవ్వలేదని స్థానిక ప్రజలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. మానకొండూరు నుంచి వీణవంక వరకు రోజూ ఇదే పరిస్థితి ఉంటుందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు.