ధన్‌బాద్‌లో భూమి కుంగి బాలుడు మృతి, ఇళ్లు ధ్వంసం

రిపోర్టర్: సతీష్ స్థలం: జార్ఖండ్

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో భారీ భూమి కుంగుబాటు ఘటనలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సిజువా తీన్ పట్టియా ప్రాంతంలో ఉదయం ఒక్కసారిగా భూమి కుంగిపోవడంతో పలు ఇళ్లు నేలకూలాయి. అక్రమ బొగ్గు తవ్వకాలే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.