ఏపీలో భారీ వర్షాలు, పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్

రిపోర్టర్: శివ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్​లో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.