బిగ్ బాస్ హౌస్‌లో హై రిస్క్ ఎలిమినేషన్ ట్విస్ట్

రిపోర్టర్: శివ స్థలం: India

బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహా పరీక్ష టాస్క్‌లో భాగంగా బ్లూ టీమ్ నుంచి రాం ప్రసాద్, మరో టీమ్ నుంచి చరణ్‌లను హై రిస్క్‌లోకి పంపారు. హై రిస్క్‌లో ఉన్నవారు ఈ వారం ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే డేంజర్ ఉంటుందని బిగ్ బాస్ బాంబ్ పేల్చారు. మరోవైపు రోహిత్ ప్రవర్తనపై హౌస్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.