దారుణం: కారు కోసం తండ్రిని గొంతు కోసి చంపిన కొడుకు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Palghar
కారు కొనుగోలు నిమిత్తం డబ్బులు ఇవ్వాలని కోరుతూ తండ్రితో గొడవపడి, గ్రైండర్తో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పాల్ఘర్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు ముకేష్ పర్మార్ తండ్రి మోహన్‌లాల్ పర్మార్ (59) పై దాడి చేసి పరారయ్యాడు. బంధువుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, గుజరాత్‌లోని భరూచ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.