భీమిలిలో ముప్పై ఏడు కోట్లతో పల్లె పండుగ పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన

రిపోర్టర్: అశోక్ స్థలం: భీమిలి

భీమిలి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ముప్పై ఏడు కోట్ల రూపాయలతో నూతన పల్లె పండుగ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మినీ గోకులాల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. నగరాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.