పుట్టినరోజు నాడు దారుణం పార్కులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
దిల్లీలోని ప్రముఖ ఆస్తా కుంజ్ పార్కులో పుట్టినరోజు జరుపుకోవడానికి వెళ్లిన 17 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెప్టెంబర్ 21న కల్కాజీ మందిర్ సందర్శించి పార్కుకు వెళ్లిన బాధితురాలిని, పోలీసులుగా నటించి బెదిరించి ఆయుధాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు వెల్లడించారు. నిందితులు స్నేహితుడిని కొట్టి, ఫోన్లు లాక్కొని ఈ దుశ్చర్యకు పాల్పడటంతో నగరంలో తీవ్ర కలకలం రేగింది.