కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పడిపోయిన మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యం

రిపోర్టర్: విజయ్ స్థలం: India

దేశంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. తాజా ప్రభుత్వ డేటా ప్రకారం సీపీఎస్‌ఈలలో మహిళల భాగస్వామ్యం కేవలం 9.8 శాతంగా మాత్రమే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం ఉద్యోగినుల సంఖ్య 77,625 నుంచి 76,685కి పడిపోయింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల డిమాండ్ నడుస్తున్న తరుణంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మహిళలకు తగిన ప్రాతినిధ్యం దక్కకపోవడం గమనార్హం.