షాకింగ్ ఘటన: గుజరాత్లో యువతి కుటుంబసభ్యుల చేతిలో క్రూరంగా యువకుడు హత్య
రిపోర్టర్: సురేష్
స్థలం: Mehsana
గుజరాత్లోని మెహసానా జిల్లాలో జరిగిన దారుణ ఘటనలో రంజిత్జీ ఠాకూర్ అనే ముప్పై ఒక్క సంవత్సరాల యువకుడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన అతడిని ఆమె కుటుంబసభ్యులు చెట్టుకు కట్టేసి కర్రలతో దారుణంగా కొట్టి చంపినట్లు వెల్లడించారు. ఈ ఘోర హత్యకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు.