ఖమ్మం జిల్లా వ్యవసాయానికి గోదావరి జలాలే శరణ్యమని వెంకట్రెడ్డి వెల్లడి
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లా వ్యవసాయానికి గోదావరి జలాలే శరణ్యమని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిడికంటి వెంకట్రెడ్డి అన్నారు. వెంకటాయపాలెంలో జరిగిన రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలని వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సాగునీటి అవసరాలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.