ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలు: రెండు రాష్ట్రాల్ లో ఏడు చోట్ల ఈడీ సోదాలు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన అక్రమాల కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏడు ప్రాంతాల్ లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు నివాసంతో పాటు పలు ప్రైవేట్ సంస్థల కార్యాలయాలలో మనీలాండరింగ్ కోణంలో తనిఖీలు సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నియామకాల వివాదంపై సిట్ దర్యాప్తు నేపథ్యంలో ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీలపై తీవ్రంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం.