'వైకాపా ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ నియామకాల్లో అక్రమాలు': ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం విజయనగరంలోని గురజాడ గ్రంథాలయం దగ్గర పోటీ పరీక్షల అభ్యర్థులతో మాట్లాడిన ఆమె.. ఆనాటి జగన్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి యువత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే వైకాపా కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.