ప్రేమకు అడ్డొచ్చిందని ప్రియురాలి అక్కపై కిరాతక హత్యాయత్నం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా కవిటికి చెందిన సాయి ప్రదీప్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్వతీపురానికి చెందిన అక్కాచెల్లెళ్లు గంగా, చంద్రమ్మ విశాఖపట్నంలోని రామ్ నగర్లో నివాసం ఉంటున్నారు. చంద్రమ్మను సాయి ప్రదీప్ ప్రేమిస్తుండగా, వీరి ప్రేమకు గంగ వ్యతిరేకించారు. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు గంగను హతమార్చాలని నిర్ణయించుకుని ఈ నెల 9న ఆమె ఇంటికి వెళ్లాడు. తాడుతో గంగ మెడకు బిగించి చంపడానికి ప్రయత్నించగా, ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో భయపడి పారిపోయాడు.