'భూమి ఎందుకు కేటాయించట్లేదు?': నవోదయ పాఠశాలలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: తమిళనాడు

తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. నవోదయ పాఠశాలల ద్వారా హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చిన కోర్టు, కేంద్రం నిధులు ఇస్తున్నప్పుడు భూమి కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను నిరాకరించడం సరైంది కాదని స్పష్టం చేస్తూ, కేంద్రంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.