దేశద్రోహులపై ఉక్కుపాదం మోపాలంటూ కేంద్రమంత్రి కిరెన్ రిజిజు వ్యాఖ్యలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు

రిపోర్టర్: కిరణ్ స్థలం: రంగారెడ్డి

భారత సైన్యం ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నకిలీ వీడియోలను ప్రచారం చేస్తోందని, ఇది క్షమించరాని దేశద్రోహ చర్య అని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యలను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా సమర్థించారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం దేశ సైనిక శక్తిని కించపరుస్తున్న వారిని తక్షణమే అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సైన్యంపై తప్పుడు ప్రచారం చేసేవారిని దేశద్రోహులుగా పరిగణించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.