నిర్మల్లో గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
రిపోర్టర్: సతీష్
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సూచించారు. సోమవారం స్థానిక పింఛనర్ల సంఘం భవనంలో నిర్మల్ నగర గణేష్ ఉత్సవ సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. శోభాయాత్ర సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.