భద్రాద్రి కొత్తగూడెంలో 40 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యారంగంలో విశేష సేవలందించిన 40 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు. కొత్తగూడెంలో శనివారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో వీరికి అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు. విద్యార్థుల ప్రగతి, పాఠశాల అభివృద్ధిలో వీరు చూపిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.