బేగంపేటలో ఘనంగా జాతీయ ఓబీసీ సదస్సు నిర్వహణ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

హైదరాబాద్ బేగంపేటలోని టూరిజంప్లాజాలో ఓబీసీ కులగణనపై జాతీయ సదస్సు ఘనంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రముఖులు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ తో పాటు పలువురు ముఖ్య నేతలు, ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు.