వడ్డెరలకు గుడ్ న్యూస్, క్వారీ లీజుల కోసం భూముల కేటాయింపు

రిపోర్టర్: శివ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డెరలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీపూల్ కోసం 100 హెక్టార్ల ప్రభుత్వ భూములను కేటాయించింది. రిజిస్టర్డ్ వడ్డెర సహకార సంఘాలకే లీజులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రీమియం అమౌంట్, సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.