మెంతి కూర తెచ్చిన విద్యార్థికి జరిమానా విధించిన పాఠశాల

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: భాయందర్

మహారాష్ట్రలోని ఠాణె జిల్లా భాయందర్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో పర్యూషన్ పండుగ సందర్భంగా మెంతి కూర తెచ్చిన విద్యార్థికి యాజమాన్యం రూ. 50 జరిమానా విధించడం తీవ్ర వివాదాస్పదమైంది. విద్యార్థులు ఇళ్ల నుంచి ఆకుకూరలు తెచ్చుకోకుండా క్యాంటీన్లోనే తినాలని ఒత్తిడి చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన మీరా భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ విద్యా శాఖ అధికారులు సదరు పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.