అల్లం వారి కుంట కబ్జాపై కలెక్టర్‌కు బాధితుల ఫిర్యాదు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడలో ఉన్న అల్లం వారి కుంట కబ్జాకు గురైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 160, 161 పరిధిలోని భూమిని కాపాడాలని కోరుతూ వారు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.