పాలకొండ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ మున్సిపల్ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొత్తం ఇరవై ఎనిమిది కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయగా, నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రతి రౌండ్ లో ఏడు టేబుళ్ల చొప్పున లెక్కింపు నిర్వహించనున్నారు. నాలుగు రౌండ్లు పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఓట్ల వివరాలు వెల్లడించి విజేతలను ప్రకటిస్తారు.