'యువతకు రూ.లక్ష సాయం': నవంబర్ 19 నుంచి నిధుల జమ

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో నవంబర్ 19వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన నిరుద్యోగులకు ఈ ఉపాధి సాయం ఎంతో దోహదపడనుంది.