'సీఐ ఆదేశాల మేరకే ఫుటేజ్ తొలగించాం': సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ విచారణలో నిందితుల సంచలన నిజాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోంగార్డ్ వెంకటరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్‌లను కస్టడీకి తీసుకుని విచారించగా.. లాకప్‌డెత్ జరిగిన రాత్రి సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఆదేశాల మేరకే తాను సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేసినట్లు హోంగార్డ్ వెంకటరాజు అంగీకరించాడు. సాక్ష్యాలు దొరకకుండా డీవీఆర్, హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు తేలడంతో సిఐ నాగరాజు, అశోక్‌ల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.