విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి.. పీడీఎస్యూ డిమాండ్

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని పీడీఎస్యూ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు ఆయన స్పందిస్తూ, తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు.

పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే విధంగా ఉన్న జీఓ 97ను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే విద్యా విధానాన్ని కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.