ఆసియా క్రీడల నుంచి తప్పుకున్న భారత ఎమ్ఎమ్ఏ ఫైటర్ వరుణ్ సన్యాల్
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
ఆసియా క్రీడల్లో భాగంగా 77 కేజీల విభాగంలో పోటీ పడాల్సిన భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ వరుణ్ సన్యాల్ అనారోగ్య కారణాల వల్ల టోర్నీ నుంచి తప్పుకున్నారు. బరువు తగ్గించుకునే క్రమంలో సోనాలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు స్పృహ కోల్పోయారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన పోరాట క్రీడలో పాల్గొనేందుకు అనర్హుడిగా వైద్యులు తేల్చడంతో, భారత ఒలింపిక్ అసోసియేషన్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.