రైతుల 22ఏ భూముల వ్యవహారంలో స్వతంత్ర విచారణకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న 22ఏ భూముల నిషేధిత జాబితా వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. అమాయక ప్రజల ఆస్తులను సరైన నిబంధనలు పాటించకుండా 22ఏ జాబితాలో చేర్చడంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును NHRC ఆదేశించింది. న్యాయవాది ఫిర్యాదు మేరకు స్పందించిన కమిషన్, ఇది ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.