ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: రమేష్ స్థలం: సూర్యాపేట

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో నిరంతరం పోరాటం సాగిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును కాపాడాలని, రాజ్యాంగ విలువలను రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఇదొక కీలక ఘట్టమని, ప్రతి సంస్థ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.