సినిమా వర్గాల్లో కలకలం: ఎన్టీఆర్, అల్లు అర్జున్తో భారీ మల్టీస్టారర్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ టాలీవుడ్ అగ్రహీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్లను కలిసి ఒక భారీ మల్టీస్టారర్ కథను వినిపించారని కోలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ కథ పట్ల ఇద్దరు స్టార్ హీరోలు కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు నటులు నిజంగా కలిసి నటిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.